తేదీ: --/--/----రోజు: --సమయం: --:--:--
BREAKING NEWS
తెలంగాణ తాజా వార్తలు • ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు • దేశవ్యాప్తంగా తాజా వార్తలు • మీ చక్రవాణి న్యూస్ • అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

వాహనాల్లో 100% ఇథనాల్‌ ఇంధనానికి కేంద్రం అనుమతి

 

E100 వాహనాలకు నిబంధనల్లో మార్పులు

ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాలకే వినియోగానికి అవకాశం


న్యూఢిల్లీ, అక్టోబర్ 28 (చక్రవాణి న్యూస్) : వాహనాల్లో అధిక ఇథనాల్‌ శాతం కలిగిన ఇంధన వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్స్‌ రూల్స్‌–1989లో సవరణలు చేస్తూ E100 ఇంధనానికి సంబంధించిన ఉద్గార ప్రమాణాల నిబంధనలను నవీకరించింది.కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ఈ మార్పులతో E85తో పాటు E100 ఇంధనంతో నడిచే వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ నిబంధనల్లో స్పష్టత ఏర్పడింది.

E85, E100 మధ్య తేడా ఏమిటి?

E85 ఇంధనంలో గరిష్ఠంగా 85 శాతం ఇథనాల్‌ ఉంటుంది. E100లో దాదాపు పూర్తిగా ఇథనాల్‌ ఆధారిత ఇంధనం ఉంటుంది. ఈ ఇంధనాలకు అనుగుణంగా తయారైన వాహనాల్లో వీటిని వినియోగించవచ్చు.

నిబంధనల్లో కీలక మార్పులు

మోటార్‌ వాహనాల నిబంధనల్లోని రూల్‌ 115, రూల్‌ 115Eలకు సంబంధించిన పట్టికలు, సాంకేతిక వివరాల్లో మార్పులు చేశారు. E100 వాహనాల ఉద్గార పరీక్షలు, ధ్రువీకరణకు సంబంధించిన నిబంధనలను కూడా నవీకరించారు.

అన్ని వాహనాల్లో వాడవచ్చా?

E100 ఇంధనాన్ని అన్ని పెట్రోల్‌ వాహనాల్లో వినియోగించడానికి ఈ నిర్ణయం అనుమతి ఇచ్చినట్లు భావించకూడదు. తయారీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించి, ధ్రువీకరించిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వాహనాల్లోనే సంబంధిత ఇంధనాన్ని వినియోగించాలి. సాధారణ పెట్రోల్‌ వాహనాల్లో మార్పులు లేకుండా E100 వాడటం సురక్షితం కాదు.ఈ మార్పులు ఇథనాల్‌ ఆధారిత ఇంధనాలతో నడిచే వాహనాల తయారీ, పరీక్షలు, ధ్రువీకరణకు నియంత్రణపరమైన స్పష్టతను అందించనున్నాయి.

భర్త ఇంటి ఎదుట చిన్నారితో భార్య నిరసన!

 

ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపణ

న్యాయం చేయాలని గేటు ముందు బైఠాయింపు


కోరుట్ల, అక్టోబర్ 28(చక్రవాణి న్యూస్‌): జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌లో భర్త ఇంటి ఎదుట భార్య అరుణ తన చిన్నారి కూతురితో కలిసి బైఠాయించి నిరసన తెలిపింది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి భర్త గణేష్‌, అత్తమామలు తనను ఇంట్లోకి రానివ్వడం లేదని అరుణ ఆవేదన వ్యక్తం చేసింది. తాను వస్తున్న విషయం తెలుసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ చిన్నారితో కలిసి ఇంటి గేటు ముందు నిరసనకు దిగింది.

ఎంపీ కొయ్యూరు పర్యటన హాస్యాస్పదం

కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా పర్యటన ఏమిటి?

కాంగ్రెస్ నాయకులు వేల్పుల మహేందర్‌


మల్హర్‌, అక్టోబర్‌ 28 (చక్రవాణి న్యూస్‌): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొయ్యూరు పర్యటనపై కాంగ్రెస్‌ బూత్‌ కమిటీ అధ్యక్షుడు వేల్పుల మహేందర్‌ విమర్శలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా పర్యటించడం ఏమిటని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు.కొయ్యూరు సదర్‌ రోడ్డు పూర్తి కావడానికి రూ.80 లక్షలు అవసరమని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో పూర్తి అంచనాలు రూపొందించాలని అధికారులు ఆదేశాలు పొందారని తెలిపారు. ఎంపీ హడావుడి పర్యటనలకు పరిమితం కాకుండా, కార్యకర్తలకు సమాచారం ఇచ్చి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని మహేందర్‌ సూచించారు.

ఎంపీ కొయ్యూరు పర్యటన హాస్యాస్పదం

 కాంగ్రెస్‌ కార్యకర్తలకు సమాచారం ఏదీ? 

మంత్రి చొరవతోనే రోడ్డు పనులకు ముందడుగు: వేల్పుల మహేందర్‌


మల్హర్‌, అక్టోబర్‌ 28 (చక్రవాణి న్యూస్‌): పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కొయ్యూరు పర్యటనపై కాంగ్రెస్‌ బూత్‌ కమిటీ అధ్యక్షుడు వేల్పుల మహేందర్‌ విమర్శలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా పర్యటించడం ఏమిటని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ప్రశ్నించారు.కొయ్యూరు సదర్‌ రోడ్డు పూర్తి కావడానికి రూ.80 లక్షలు అవసరమని, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చొరవతో పూర్తి అంచనాలు రూపొందించాలని అధికారులు ఆదేశాలు పొందారని తెలిపారు. ఎంపీ హడావుడి పర్యటనలకు పరిమితం కాకుండా, కార్యకర్తలకు సమాచారం ఇచ్చి మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని మహేందర్‌ సూచించారు.

మేకల అప్పయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

 అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి భరోసా


మల్హర్‌, అక్టోబర్ 28(చక్రవాణి న్యూస్) : మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య తండ్రి మేకల అప్పయ్య ఇటివల మృతి చెందగ అప్పయ్య కుటుంబాన్ని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మంగళవారం సాయంత్రం పరామర్శించారు. అప్పయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, అధైర్యపడవద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఐత రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి, మాజీ ఎంపీటీసీ అవిర్నేని ప్రకాష్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

శాత్రాజ్‌పల్లె బాధితుల గోడు.. మంత్రి దృష్టికి!

సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్న శ్రీధర్‌బాబు

సర్పంచ్‌ బండి స్వామి ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన బాధితులు


మల్హర్‌, అక్టోబర్‌ 27 (మేజర్‌ న్యూస్‌ సూర్య):మండలంలోని తాడిచెర్ల పరిధి శాత్రాజ్‌పల్లె ఇళ్ల కూల్చివేత బాధితుల సమస్యను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తాడిచెర్ల సర్పంచ్‌ బండి స్వామి తెలిపారు. మంగళవారం మంథని నియోజకవర్గంలోని గంగాపురి వద్ద తన ఆధ్వర్యంలో బాధితులతో కలిసి మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశామని పేర్కొన్నారు.అర్ధరాత్రి అధికారులు ఇళ్లను కూల్చివేసిన ఘటనను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించినట్లు బండి స్వామి తెలిపారు. బాధితులకు న్యాయం చేయాలని మంత్రిని కోరగా, శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించి త్వరలోనే సంబంధిత అధికారులతో మాట్లాడతానని చెప్పినట్లు వెల్లడించారు.శాత్రాజ్‌పల్లె బాధితుల సమస్యను పరిష్కరించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ బండి స్వామి కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు రత్నాకర్‌రెడ్డి, మద్దుల శ్రీనివాస్‌, అరుగొండ కృష్ణమూర్తి, ఆకుల రాజేశం, జక్కుల రమేష్‌, ఆకుల సది, కుంట సదానందం, తిరుపతి యాదవ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

పులివెందల నుంచే ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం

 

నామినేషన్లు అడ్డుకున్నారని జగన్‌ ఆరోపణలు కార్యకర్తలకు అండగా ఉంటానని వెల్లడి

పులివెందల, చక్రవాణి న్యూస్‌: ఎన్నికల్లో ప్రత్యర్థులను పోటీకి రానివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందలలో పార్టీ నేతలు, కార్యకర్తలు, మున్సిపల్‌, జడ్పీటీసీ ఎన్నికల అభ్యర్థులతో సమావేశమైన ఆయన ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.పులివెందలలో 40 వార్డులకుగాను 20 వార్డుల్లోనే పోటీ చేసే పరిస్థితి కల్పించారని, ఏడు జడ్పీటీసీ స్థానాల్లో నాలుగు చోట్లే పోటీకి అవకాశం ఇచ్చారని జగన్‌ ఆరోపించారు. నామినేషన్‌ పత్రాలను చించేయడం, అభ్యర్థులను అడ్డుకోవడం, కేసులు నమోదు చేయడం ద్వారా ప్రజాస్వామ్య హక్కులను హరిస్తున్నారని విమర్శించారు.

మహిళా అభ్యర్థులకు అన్యాయం

మహిళా అభ్యర్థులను అడ్డుకోవడం, వారిపై దాడులకు పాల్పడటం దారుణమని జగన్‌ అన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం, విద్య, ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రాధాన్యం ఇచ్చామని గుర్తుచేశారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

అరెస్టులు, కేసులకు భయపడేది లేదని, కార్యకర్తల సమస్యలను తన సమస్యలుగా భావిస్తానని తెలిపారు. పోలీసులు, అధికారులు రాజ్యాంగానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పులివెందల నుంచి ప్రారంభమయ్యే ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు.


Name

MENU MENU

chakravani news chakravani news

SEARCH
Powered by Blogger.

Search This Blog

Life & style

Games

POLITICS$type=left$va=0$count=3

ARCHITECT$type=one$count=3


Gallery

Full width home advertisement

Archive Pages Design$type=blogging$count=7

Author Description

Hey there! We are చక్రవాణి న్యూస్ — అన్యాయంపై అక్షర సమరం – అవినీతిపై సుదర్శన చక్రం

/gi-fire/ YEAR POPULAR$type=one

Post Page Advertisement [Top]

Comments

Recent

Bottom Ad [Post Page]

Tags

Labels

Travel the world

Advertisement

Climb the mountains